ప్రతి ఆటో డ్రైవర్ విధిగా లైసెన్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని అదేవిధంగా ప్రతి డ్రైవర్ ఏకరుపు దుస్తులను ధరించాలని మండపేట రూరల్ సీఐ పి. దొరరాజు అన్నారు. బుధవారం మండపేటలో ఆటో యూనియన్లకు చెందిన డ్రైవర్లతో రూరల్ సీఐ దొరరాజు, టౌన్ ఎస్ఐ హరికోటిశాస్త్రి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు.