1985-86లో కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం కాకినాడ మానస సరోవర్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు 38 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు.