ఘనముగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

683చూసినవారు
ఘనముగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు & ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దాట్ల సుబ్బరాజు విచ్చేసి కేకు కటింగ్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న గర్భిణి స్త్రీలకు, రోగులకు బ్రెడ్, పండ్లు పంచిపెట్టినారు. ఈ కార్యక్రమలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్