విద్యార్థులు క్రమ శిక్షణతో మెలిగి, ఉత్తమ పౌరులుగా రాణించాలని కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం వద్ద మంగళవారం మహిళా సంరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ, యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.