ముమ్మిడివరం నియోజకవర్గం లో ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఇదేం ఖర్మ రా మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. మురమళ్ళ గ్రామ పంచాయతిలో న్యూ కాలనీ, పితాని వారి పాలెం, చెయ్యేటి వారి పేట, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.