యానాంలోని స్లమ్ క్లియరెన్స్ హౌసింగ్ బోర్డు అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యానాంలో నివాసం ఉంటూ ప్రభుత్వం ద్వారా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఇల్లు కట్టుకున్న వారికి పెండింగ్ లో ఉన్న ఋణ మొత్తాలు త్వరగా విడుదల చేయాలన్నారు. అలాగే ఇళ్లు పూర్తి చేసిన వారికి తక్షణమే తమ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పారు.