నిడదవోలు: రాష్ట్రస్థాయి పోటీలకు తాడిమల్ల విద్యార్థులు ఎంపిక

61చూసినవారు
నిడదవోలు: రాష్ట్రస్థాయి పోటీలకు తాడిమల్ల విద్యార్థులు ఎంపిక
ఉమ్మడి ప. గో జిల్లా అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీల్లో నిడదవోలు మండలం తాడిమల్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. అండర్-17 విభాగంలో చంద్రశేఖర్, శామ్యూల్ రాజు, కార్తీక్, సింధు, అండర్-14 విభాగంలో పుష్పకన్య ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణశాస్త్రి వ్యాయామ ఉపాధ్యాయులు ప్రదీప్ శుక్రవారం తెలిపారు. వీరు నవంబర్ 3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్