
నిడదవోలు: నూతన హెచ్డిఎస్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం
నిడదవోలు పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం హెచ్‌డీఎస్ కమిటీ నూతన సభ్యులను నియమించబడ్డారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారంలో నిడదవోలు ఎమ్మెల్యే దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమించబడిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.