పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా వచ్చిన రాబడులు, ఖర్చులు ముగింపు నిల్వల గురించి పూర్తిగా చదివి వినిపించారు. అనంతరం నూతన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు ఎంపీపీ అరిగెలా ఆచియమ్మ రామయ్య దొర, జడ్పిటిసి ఉలవకాయల నాగలోవరాజు , ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.