పిఠాపురం: వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

67చూసినవారు
పిఠాపురం: వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన గురువారం అమరావతిలో భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 'వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య' అని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్