ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో హోం మంత్రి అనిత గురువారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో అనిత ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ సూచించినట్లు పేర్కొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.