గొల్లప్రోలు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు ధనుర్మాసం సందర్భంగా ఆదివారం వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామం పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి హారతి ఇచ్చారు. పూజా కార్యక్రమాలు అనంతరం ప్రసాద వితరణ నిర్వహించగా వందలాది మంది మహిళలు, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.