పిఠాపురం: సూపర్ సిక్స్ పై మాట్లాడే అర్హత వైకాపాకు లేదు

52చూసినవారు
పిఠాపురం: సూపర్ సిక్స్ పై మాట్లాడే అర్హత వైకాపాకు లేదు
సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడే అర్హత వైకాపాకు లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను వైకాపా మాజీఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో ఆయన చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు.