
పిఠాపురం: లోకేశ్ వల్లనే కూటమికి అధికారం: ఎస్వీఎస్ఎన్ వర్మ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసి చంద్రబాబుకు నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. టీడీపీకి ఇప్పుడు లోకేశ్ నాయకత్వం అవసరమని, సీఎం చంద్రబాబు పార్టీ సారథిగా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.