పిఠాపురం: పోలేరమ్మ జాతరలో దున్నపోతుతో తొక్కించుకున్న భక్తులు

76చూసినవారు
కొత్తపల్లి మండలం అమీనాబాద్ కు పోలేరమ్మ గ్రామ దేవత. ఇక్కడో వింత ఆచారం ఉంది. కొత్త అమావాస్యకు ముందు అమ్మవారి భక్తులు స్నానాలు చేసి వరుసగా రోడ్డుపై పడుకుంటారు. వారిపై నుంచి తొక్కుకుంటూ దున్నపోతు వెళుతుంది. ఇలా చేస్తే అనారోగ్య బాధలు, పెళ్లికాని వారికి పెళ్లవుతుందని నమ్ముతారు. గురువారం దీనిని చూసేందుకు వేలల్లో భక్తులు వచ్చారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇది తమ ఆచారమని మత్స్యకారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్