పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన మొరాల శెట్టి ఏసు అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యారు. విషయం తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ సభ్యులు ఏసుకు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా నిత్యవసర సరుకులుఆర్థిక సాయం అందజేశారు. ఈ నిత్యవసర సరుకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా మొరాలశెట్టి ఏసు కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు.