
లంచం తీసుకున్న పిఠాపురం రూరల్ ఎస్ఐ సస్పెండ్
ఇటీవల పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంతమూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర లంచం తీసుకున్న పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖరు ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే. మార్చి 24న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఐ గుణశేఖర్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.