యు. కొత్తపల్లి: మూలపేటలో అశ్లీల నృత్యాలు

80చూసినవారు
యు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ వారి జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగాయి. కొంత మంది రాజకీయ నాయకులు దగ్గరుండి ప్రదర్శన జరిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతర నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి 12 గంటల తరువాత వచ్చి నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్