గొల్లప్రోలు పట్టణంలో బస్టాండ్ వద్ద గల నూకాలమ్మ తల్లి అమ్మవారి జాగరణ జాతర శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మరోపక్క విశేషమైన అలంకరణ శక్తి వేషాలు గరగల నృత్యాలు, విద్యుత్ అలంకరణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షించారు.