పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు శనివారం సాయంత్రం సీఐ శ్రీనివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణానికి వేలాది మంది యాత్రకులు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు తరలి వస్తారని వారి పట్ల మర్యాదగా పూర్వకంగా ప్రవర్తించాలని మద్యం సేవించి ఆటో నడపరాదని ఆటో డ్రైవర్ చేత ప్రమాణం చేయించారు. ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.