ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా సూర్య నమస్కారాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, వ్రత పురోహితులు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య భగవానుడికి వివిధ ఆసనాల్లో సూర్య నమస్కారాలు నిర్వహించారు. సూర్య నమస్కారం కార్యక్రమంలో ప్రతపురోహితులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.