ఆల్ ఇండియా సర్వీసెస్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్రస్థాయి పర్యటనలను తూ. గో జిల్లాలో 7 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శిక్షణకు ఎంపికైన 10 మంది ఐఏఎస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి క్షేత్రస్థాయి పర్యటనల్లో చేపట్టవలసిన పరిశోధనలపై అవగాహన కల్పించారు.