రాజమండ్రిలో పేషేంట్ కి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అందజేత...

4955చూసినవారు
20-02-202, సోమవారం సాయంత్రం రాజమండ్రిలోని స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉండి మన బాధ్యత ఫౌండేషన్ ని సంప్రదించగా, సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ కి ఫోన్ చేసిన వెంటనే స్పందించి, ఉప్పల సాయి కుమార్ అనే డోనర్ ద్వారా ప్లేట్లెట్స్ సేకరించి పేషేంట్ కి అంధించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయిన ఎంతోమంది పేషేంట్లకు సంజీవని బ్లడ్ బ్యాంక్ ద్వారా సకాలంలో బ్లడ్ అందిస్తున్నాం అని, ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుంది అని తెలియజేసారు. ఈ సందర్భంగా సాయి కుమార్ ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్