రాజమండ్రి: పతనమవుతున్న వైసీపీని వీడాలి
జగన్కు కుడి చెయ్యిగా కొనసాగిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ పతనమైపోయిందని తూ. గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీ. కే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ వైసీపీని నాయకులు వీడి కాంగ్రెస్లోనికి వస్తే వారికి సముచిత స్థానం కల్పిస్తానని ప్రకటించారు. పతనమవుతున్న వైసీపీని వీడాలంటూ ఆయన ఆహ్వానం పలికారు.