తీసుకున్న అప్పు తీర్చమని అడిగేందుకు వెళ్లిన ఓ తండ్రి, కుమార్తెపై వైసీపీ నేత దాడి చేసిన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. విజయవాడ కుంచరపల్లికి చెందిన కావ్యశ్రీ అనే యువతి యాంకర్‌గా స్థిరపడ్డారు. 2021లో రాజమహేంద్రవరంకు చెందిన వైసీపీ నేత నల్లూరి వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్‌కు కావ్యశ్రీ రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు వసూలు చేసేందుకు అభిలాష్ ఇంటికి తండ్రి, కుమార్తె వెళ్లగా.. అతని తండ్రి వెంకట శ్రీనివాస్ వారిపై దాడి చేశారు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.