ఈ నెల 4వ తేదీ నుంచి రాజమండ్రి రూరల్ మండలంలోని ధవలేశ్వరంలోని గోదావరి డెల్టా కాలువలకు ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఈఈ ఆర్. కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు. 4న పశ్చిమ డెల్టా, 5న మధ్య డెల్టా, 6న తూర్పు డెల్టా స్కవర్ స్లూయిజ్ వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు. ఫ్లషింగ్ ఆపరేషన్ ద్వారా రానున్న రబీలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు.