తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవిచౌక్ సెంటర్లో వెలసియున్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రధానఅర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధ శర్మతీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు దంపతుల ఆర్థిక సహాయంతో పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.