కోరుకొండ మండలంలోని మధురపూడి, ఉండలేశ్వరం, బూరుగుపూడి గ్రామాలలో కలెక్టర్ ప్రశాంతి బుధవారం పర్యటించారు. ఆయా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలోని పంట భూములు ముంపునకు గురికాకుండా చేపట్టవలసిన నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి ముంపు నీరు పోయేందుకు ఏర్పాట్లు చేయాలని, ఆక్రమణలు ఉంటే తొలగించాలని అధికారులకు సూచించారు.