కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కావాలని అమాయక ప్రజలను రెచ్చగొట్టి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అటువంటి వారిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఈ మేరకు రామచంద్రపురంలో సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రామచంద్రపురంలోని భూ సమస్యల్లో కావాలని నా పేరు వాడుతున్నారన్నారు. వివాదాస్పద భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు.