ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చేసిన ప్రకటన నిరుద్యోగుల ఆశలను నీరుగార్చినట్లు ఉందని మామిడికుదురు మండలం అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు పల్లంరాజు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అయ్యేంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకూడదని చంద్రబాబును కోరినట్లు, దానికి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆయన ప్రకటించుకున్నారన్నారు.