వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజోలు మండలం శివకోటిలో మాట్లాడుతూ జెఎల్. రైతు మిత్ర గ్రూపులకు కూడా రుణాలు ఇవ్వకుండా ఆంక్షలు పెడుతున్నారు. దీంతో కౌలు రైతులు అధిక వడ్డీలకు తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడంతో వారు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు.