రాజోలు మండల విద్యా శాఖ కార్యాలయంలో గురువారం మండల విద్యా శాఖాధికారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి నల్లి మనోహరం మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అన్నారు. నిబంధనలను పాటించకపోతే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.