తుని పట్టణంలో గర్ల్స్ హైస్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. గురువారం రాత్రి తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి ఆమె జాబ్ మేళా గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు వివిధ కంపెనీలో 1004 ఉద్యోగాలకు కోసం అక్టోబర్ 18న స్థానిక గర్ల్స్ హైస్కూల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.