తుని: మృతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం
తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల తుని మండలం ఎర్ర కోనేరు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు కాకినాడలో మృతి చెందారు. రెండు కుటుంబాలకు రూ. 2 రెండు లక్షల చొప్పున తన సొంత నిధులతో చెక్కులను విజయవాడలో కుటుంబ సభ్యులకు అందించారు.