ఆర్టీసీ బస్సు డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ను రద్దు చేయగా మంగళవారం విధుల్లో చేరారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో డ్రైవర్ లోవరాజు డ్యూటీకి హాజరయ్యారు. బస్సు ముందు డ్రైవర్ డాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై వచ్చిన ట్వీట్లకు లోకేశ్ స్పందిస్తూ డ్రైవర్ లోవరాజును వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. విదేశీ పర్యటన అనంతరం తనను కలుస్తానని లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు.