అయినవిల్లి: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ
క్యాన్సర్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. లక్ష్మి సౌజన్య శుక్రవారం సూచించారు. ఈ మేరకు పీహెచ్సీ వద్ద మెడికల్ సిబ్బందితో క్యాన్సర్ వ్యాధిపై ర్యాలీ నిర్వహించి, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ.. 18 సం. పైబడిన వారందరికీ వారి ఇంటివద్దే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించబోతున్నామన్నారు.