అయినవిల్లి మండల వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అయినవిల్లి పెద్దపేట, జై భీమనగర్, కె. జగన్నాథపురం వీవర్స్ కాలనీ, వెలువలపల్లి ఎం. ఎస్. ఎన్ కాలనీ బుధవారం నీట మునిగాయి. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వర్షపు నీటిని బయటకి మళ్లించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.