బోయిన్ పల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణంకు ఎమ్మెల్యే భూమిపూజ

58చూసినవారు
బోయిన్ పల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణంకు ఎమ్మెల్యే భూమిపూజ
జడ్చర్ల నియోజకవర్గం బోయిన్ పల్లిలో 3 కోట్ల 50 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులకు 24 గంటల కరెంటు ఉండాలనే ఉద్దేశంతో రూ. 3 కోట్ల 50 లక్షలతో నూతన సబ్ స్టేషన్ ను మంజూరు చేయించామని, 1020 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గృహ జ్యోతి ద్వారా మండలంలో 4739 మంది లబ్ధిదారుల 71 లక్షలు బిల్లును ప్రభుత్వం కట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్