Jan 31, 2025, 17:01 IST/
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం
Jan 31, 2025, 17:01 IST
TG: నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కన శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన మెట్రో సిబ్బంది స్టేషన్లో లిఫ్ట్‌ను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.