కాండ్రేగుల గ్రామంలో కనువిందు చేసిన హరివిల్లు
జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం హరివిల్లు చూపరులను కనువిందు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ కాసినప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. అదే సమయంలో ఎండ రావడంతో ఆకాశంలో హరివిల్లు కనిపించి ప్రజలను ఆకట్టుకుంది. ఈ హరివిల్లును పలువురు తమ ఫోన్లలో ఫోటోలు తీశారు.