Sep 22, 2024, 02:09 IST/
1940లో మొదలైన తిరుమలలో లడ్డూ ప్రసాదం
Sep 22, 2024, 02:09 IST
తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయల కాలంలో తిరుమల భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. ఆ తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి.. వంటి ప్రసాదాలను స్వామివారికి సమర్పించేవారు. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. అది కాస్తా చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది.