Sep 29, 2024, 13:09 IST/
బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం.. (వీడియో)
Sep 29, 2024, 13:09 IST
కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఆట కూడా రద్దైన సంగతి తెలిసిందే. వర్షపు నీరు గ్రౌండ్ లో నిలిచిపోవడంతో మైదానం చిత్తడిగా మారింది. 2 రోజులే మిగిలున్న ఈ మ్యాచ్ దాదాపు డ్రా అయినట్లే. దీంతో బీసీసీఐపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వర్షం వస్తుందని తెలిసినా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తున్నారు. స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.