Nov 21, 2024, 17:11 IST/
మంత్రి కొండా సురేఖ ఇంట్లో బీర్ల పార్టీ.. వీడియో వైరల్
Nov 21, 2024, 17:11 IST
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మనవరాలు కొండా శ్రేష్ఠ 13వ పుట్టినరోజు గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా చిన్నపాప పేరుతో అందరికీ బిర్యానీతో పాటుగా బీర్లు కూడా తెప్పిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ లైవ్లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అధికారిక సెలబ్రేషన్ అన్నప్పుడు బిర్యానీ ఉంటే బీర్ కూడా ఉంటుంది అని సురేఖ పేర్కొన్నారు.