ఇక నుంచి పాత విధానంలోనే కార్యకలాపాలు: సీఐ
సెబ్, ఎన్ ఫోర్స్ మెంట్ పేరుతో కొనసాగిన ఎక్సైజ్ శాఖ తిరిగి పాత విధానంలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం ముమ్మిడివరంలో ఎక్సైజ్ స్టేషన్ వద్ద నూతన బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ రామారావు మాట్లాడుతూ. ప్రభుత్వం నూతనంగా చేసిన మార్పులకు అనుగుణంగా కార్యాలయం వద్ద బోర్డు మార్చడం జరిగిందన్నారు.