శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంపై సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన ఈవో

74చూసినవారు
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంపై  సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన ఈవో
లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై తితిదే ఈవో జె.శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. దీనిపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో సీఎంకు వివరించారు. విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్