Sep 13, 2024, 04:09 IST/
మాజీ మంత్రి హరీశ్ రావుని బయటకు అనుమతించని పోలీసులు (వీడియో)
Sep 13, 2024, 04:09 IST
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గృహ నిర్భంధం చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తాను అంటే కూడా పోలీసులు అనుమతించట్లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.