కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువద్దాం
అందరూ సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం కొత్తపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రౌతు ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.