వనపర్తి జిల్లాలో ఆదివారం నిర్వహించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అంచెలంచెలుగా ఎదిగి, సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారని 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.