రావులపాలెం: ఎన్నికల హామీలు నెరవేర్చడమే లక్ష్యం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి వాటిని నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. రావులపాలెం శ్రీ కృష్ణదేవ రాయ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దీపం పథకం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానంద రావు, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీకర్, ఆకులరామకృష్ణ, కె విసత్యనారాయణ రెడ్డి, చిలువూరి సతీష్ రాజు పాల్గొన్నారు.