సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి
శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. నరసింహా నాయక్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిబ్బంది హాజరు పట్టీని, అన్ని దస్త్రాలను పరిశీలించారు. ప్రస్తుత కాలపు వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తూ రోగులకు సకాలంలో వైద్యం అందిస్తూ రోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను సూచించారు.